గుజరాత్‌లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వడోదర సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్‌ను బరిలోకి దింపగా.. తాజాగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రంజన్ భట్ ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా వెల్లడించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వడోదర లోక్‌సభ స్థానం నుంచి ఆమెను మళ్లీ నామినేట్ చేయాలనే బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నగరంలోని పలు ప్రదేశాలలో బ్యానర్లు కూడా ప్రదర్శించారట. 2014లో జరిగిన ఉప ఎన్నికలో ప్రధాని మోదీ ఆ స్థానం నుంచి తప్పుకోవడంతో భట్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఇదే స్థానం నుంచి 2019లోనూ బరిలోకి దిగి విజయం సాధించారు.
అలాగే సబర్‌కాంత లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి భిఖాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఠాకూర్‌పై కూడా స్థానిక నేతల అసంతృప్తినే కారణం. అయితే, ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశకం చేసినట్లు సమాచారం. కాగా, గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
Spread the love *08.22.2024* పేదరాలి భూమి లాక్కొని చంపుతామని బెదిరిస్తోన్న పిన్నెల్లి అనుచరులు టీడీపీ సానుభూతి పరులైతే వైసీపీ పాలనలో పింఛన్ లు కట్ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పేరు చెప్పి బెదిరిస్తోన్నారని APSSAAT […]
Spread the love యువత స్వయం సమృద్ధి సాధించాలి ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వదేశీ జాగరణ మంచ్, ఆధ్వర్యంలో స్వదేశీ స్వావలంబన, రాష్ట్ర మహాసభను, ఆదివారం కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ […]
Spread the love 19.07.2024 ఏపీ మెడ్ టెక్ జోన్ ను సందర్శించిన ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రి వైద్య పరికరాల తయారీ, వసతుల గురించి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివిధ కంపెనీల సీఈవోలతో ఆత్మీయ […]