కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి దానం నాగేందర్‌పై సొంత పార్టీ నేత రాజుయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టిక్కెట్ ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. బుధవారం రాజుయాదవ్ మీడియాతో మాట్లాడుతూ… దానం నాగేందర్ బలమైన నేత అనుకొని టిక్కెట్ ఇచ్చారని, కానీ తన దృష్టిలో ఆయన బలమైన నాయకుడేమీ కాదన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ టిక్కెట్ తీసుకున్నందున అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
పార్టీలు మారి వచ్చి టిక్కెట్ దక్కించుకున్న ఆయన… రేపు గెలిచాక మరోసారి పార్టీ మారడనే గ్యారెంటీ ఏమిటి? అని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చింది కాబట్టే తాము వ్యతిరేకించడం లేదన్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ముందు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన ఎలాంటి చర్య తీసుకోనందున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తేనే గెలుస్తాడన్నారు. తాను కోవర్టును కాదని నిరూపించుకోవాలంటే రాజీనామా చేయాలన్నారు.
Spread the love మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్లో […]
Spread the love లోక్‌సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్ లోక్‌సభ స్థానం పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అభ్యర్థి […]
Spread the love అసహనం వ్యక్తం చేసిన ఎమ్మేల్యే .. ఎస్పీ రితిరాజ్ కి ఫోన్ జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణంలో వరుస దొంగతనాలపై ఎమ్మేల్యే బండ్ల క్రిష్ణ మొహన్ రెడ్డి అసహనం […]