రైతుకి అండగా టీడీపీ :యార్లగడ్డ

3
0

రైతుకి అండగా టీడీపీ :యార్లగడ్డ 

గన్నవరం  

అన్నదాతకు ఎల్లప్పుడూ టిడిపి నే అండగా ఉంటుందని గన్నవరం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి  యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం ఉదయం గన్నవరం మండలంంలోని  కొండపావులూరు, గోపవరపుగూడెం తదితర గ్రామాల్లో అదేవిధంగా సాయంత్రం సురంపల్లి ముస్తాబాదు గ్రామాలలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు యార్లగడ్డకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లో  పర్యటించిన యార్లగడ్డ  టీడీపీ ఎన్నికల

 మ్యానిఫెస్టో ని ప్రజలకు తెలియచేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తరువాత ప్రజలకు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వెంకట్రావ్  మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరిగిందని తదుపరి వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పట్టించుకున్న నాధుడేలేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం లో ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర లభించిందని నేడు పంటలు అమ్ముకునే పరిస్థితే లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని మరో నెల  రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఆధైర్య పడవద్దని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగ సమస్యలపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందన్నారు. వచ్చే నెల 13న జరుగనున్న ఎన్నికల్లో బందరు పార్లమెంటుకు బాలసౌరికి గాజు గ్లాస్ గుర్తుపైనా, గన్నవరం అసెంబ్లీకి తనకు సైకిల్ గుర్తుపైనా ఓట్లు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జస్థి వెంకటేశ్వరావు, పొట్లూరి బసవరావు, జూపల్లి సురేష్, మూడవ లక్ష్మి, చీమలదండు శివరామకృష్ణ, మండవ అన్వేష్, లావు వంశీ కృష్ణ, షేక్ అభ్యులాజ్, బొర్రా సాయిరాం, బడుగు గోపి, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here