వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎవరికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నావ్..?* అసమర్థుడువనే ప్రజలు నిన్ను ఓడించినందుకా..?* నమ్మి ఓటేసిన ప్రజలను, కన్నతల్లిని, చెల్లెళ్లను మోసం చేశావ్* అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు* 12 నెలలో కాలంలో ఎంతో అభివృద్ధి చేశాం…* ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలనూ నెరవేర్చాం* కొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అమలు* ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం* 12 నుంచి 71 వేలకు పైగా స్పౌజ్ పెన్సన్లు పంపిణీ : మంత్రి సవిత* లబ్ధిదారులకు పెన్షన్లు, గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన మంత్రి* స్వయంగా టీ చేసి లబ్ధిదారులకు అందజేసిన మంత్రి సవితఅభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు అని, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఓటేసిన ప్రజలను, కన్నతల్లిని, చెల్లెళ్లను మోసగించిన జగన్ కంటే ఈ లోకంలో ఇంకెవ్వరూ వెన్నుపోటుదారుడు ఉండరన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా ఇష్టారాజ్యంగా దోపిడికి తెగబడడంతోనే జగన్ రెడ్డిని ప్రజలు ఓడించారన్నారు. పెనుకొండ పట్టణంలోని న్యూ కాలనీలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను, ఉచిత గ్యాస్ సిలిండ్లను మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ, వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు జగన్ బ్రాండ్ అంబాసిడరన్నారు. అధికారం కోసం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి అమలు చేయకుండా చేతులెత్తేసిన అసమర్థుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అని చెప్పి గెలిచిన తరవాత మూడు ముక్కలాటకు జగన్ రెడ్డి తెరతీశాడన్నారు. పోలవరం పూర్తి చేస్తానని చెప్పి పట్టించుకోవడం మానేశాడన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్ని విధాల వెన్నుపోటు పొడిచిన జగన్ సిగ్గుపడాలన్నారు. ఎవరికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారని మంత్రి సవిత ప్రశ్నించారు. ఓడించినందుకు ప్రజలకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారా..? అని మంత్రి నిలదీశారు. *హామీలన్నీ నెరవేరుస్తున్నాం…*కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతోంని మంత్రి సవిత తెలిపారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ఇసుక, మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని, జగన్ చీకటి చట్టం ల్యాండ్ టైటిట్ యాక్టు రద్దు చేశామని తెలిపారు. రాష్ట్రంలో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేల పెన్షన్లు పెంచామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో మినహా మరే రాష్ట్రంలోనూ రూ.4 వేల పెన్షన్ ఇవ్వడంలేదన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ తీసుకొస్తున్నారన్నారు. మరో 10 రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించనున్నామన్నారు. కొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రారంభించబోతున్నామన్నారు. వచ్చే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే, వెన్నుపోటుకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. *12న 71 వేలకు పైగా స్పౌజ్ పెన్షన్లు*రాష్ట్రంలో కొత్తగా 71,380 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. స్పౌజ్ కేటగిరీ పింఛన్ల ద్వారా నెలకు రూ. 4 వేల చొప్పున పింఛన్ అందించనున్నామన్నారు. ఈ నెల 12వ తేదీన స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. జూన్ ఒకటో తారీఖు ఆదివారం పడడంతో, మే 31న శనివారమే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.2,717 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షలకు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. *టీ చేసిన మంత్రి సవిత*దీపం-2 పథకంలో భాగంగా మహిళా లబ్ధిదారులకు మంత్రి సవిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుని ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలిగించి, టీ చేసి లబ్ధిదారు కుటుంబ సభ్యులకు మంత్రి సవిత అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. అంతకుముందు పెన్షన్లు, గ్యాస్ సిలిండర్ల పంపిణీకి వచ్చిన మంత్రి సవితకు న్యూ కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సవిత లబ్ధిదారుల ఇంటింటికీ ఆప్యాయంగా పలుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.