గన్నవరం నియోజకవర్గం, గడపగడపకు ప్రజాగళంలో యార్లగడ్డ జ్ఞానేశ్వరి పిలుపు

Spread the love

 గన్నవరం నియోజకవర్గం,

బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్

నవ్యాంధ్ర భావితరం భవిష్యత్తు, పారిశ్రామికీకరణ, యువతకు ఉపాధి కోసం ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ ను గెలిపించుకుందాం

గడపగడపకు ప్రజాగళంలో యార్లగడ్డ జ్ఞానేశ్వరి పిలుపు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తునందున ప్రజలను చైతన్యవంతం చేసేందుకు గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి  యార్లగడ్డ జ్ఞానేశ్వరి, జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, బాపులపాడు టౌన్ టి.డి.పి అద్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు, ఇతర ముఖ్య నాయకులతో కలసి ఈరోజ సాయంత్రం గడపగడపకు ప్రజాగళం పేరుతో హనుమాన్ జంక్షన్ లోని ఇందిరానగర్, B C కాలనీ వద్ద నుండి ప్రారంభించి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్, బాపులపాడు మండల టి.డి.పి – జనసేన – బి.జె.పి కి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్బంగా యార్లగడ్డ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ఫార్ములా – పి4 నారా చంద్రబాబునాయుడు  వినూత్న ప్రణాళిక అని రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో పేద ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పూర్ టు రిచ్ పథకాన్ని అమలు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఫార్ములా పి4 అనగా పబ్లిక్, ప్రయివేట్, పీపుల్, పార్టనర్షిప్ అని దీనినే పి4 అని చంద్రన్న సరికొత్త సమ్మిళిత అభివృద్ది సూత్రం అని తెలిపారు. 

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధానిపై నెలకొన్న సందిగ్ధతను తొలగించి దేశంలోని మహా నగరాల జాబితాలోకి రాజధానిని తీసుకెళ్ళి గల సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబునాయుడని అన్నారు.

భావితరం భవిష్యత్తు, పారిశ్రామికీకరణ, యువతకు ఉపాధి తదితర ముఖ్యమైన అంశాలమీద నిరంతరం పోరాటం చేయగలగిన నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలసౌరి కి ప్రజలందరూ మద్దతు పలికి సైకిల్ గుర్తుకు, గాజుగ్లాస్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరుమామిళ్ల సూర్యం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, వేగిరెడ్డి పాపారావు, వీరమాచినేని సత్యప్రసాద్, సుంకర బోస్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు వడ్డి నాగేశ్వరావు, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు అహ్మద్, కార్యదర్శి  పాటి రాజేశ్వరరావు, వడ్డిల్లి లక్ష్మి, ముత్యాల సువర్ణరాజు, వరి గంజి కిషోర్, చీలి ఆనంద్, పరసా కిట్టు, యలమంచిలి వెంకటేశ్వరరావు, కడవకొల్లు నాగరాజు, తాడిశెట్టి శ్రీనివాసరావు, వెనిగళ్ళ వెంకటేశ్వరావు, షాహీదా, ప్రసన్న, లక్ష్మి, పుష్ప, 

స్ధానిక టి.డి.పి నాయకులు , గుమ్మడి శేషగిరిరావు, పొట్లూరి ఫణి, బోయపాటి ప్రసాద, గొట్టాపు వాసు, కొల్లి బుజ్జి, చెరుకూరి హరికృష్ణ, కొండ జ్యోతి, జనసేన నాయకులు పవన్, అర్జున్, సమీర్, భార్గవ్, అశోక్, జయరాణి పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *