మన తల రాత మనమే మార్చుకోవాలి.. జగన్ అధర్మ పాలనను తరిమికొట్టాలి : టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని
పశ్చిమంలో వైసీపీకి భారీ షాక్..
పశ్చిమంలో పట్టుకోల్పోతున్న వైసిపి
ఏడు డివిజన్స్ నుంచి నాయకులు వైసిపికి గుడ్ బై
టిడిపి కండువా కప్పుకున్న వైసిపి డివిజన్ యూత్ వింగ్ లీడర్స్
టీడీపీకి మద్దతు ప్రకటించిన మైనార్టీ, బిసి, విద్యార్ధి నాయకులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రజల తలరాతలు మారుస్తాడని నమ్మి ఒక ఛాన్స్ ఇస్తే… రాష్ట్రాన్ని దోచి జగన్ తన బినామిలా తలరాతలు మార్చాడు . ఐదేళ్ల నుంచి ప్రజల్ని పీడించుకు తింటున్న జగన్ నుంచి విముక్తి పొందటానికి మన తలరాత మనమే మార్చుకోవాలి. ఇందుకోసం అధర్మపాలన చేస్తున్న జగన్ ను ఓడించి తరిమికొట్టాలని బిజెపి, జనసేన బలపరిచిన టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పశ్చిమ నియోజకవర్గం నుంచి దాడి మురళీకృష్ణ ఆధ్వరంలో శుక్రవారం భారీ చేరికలు జరిగాయి. వైసిపి మైనార్టీ సిటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇంతియాజ్ తో పాటు 55వ, 53వ, 51వ, 45వ, 50వ, 54వ,55వ డివిజన్స్ కి చెందిన వైసిపి యూత్ ప్రెసిడెంట్స్, బిసి నాయకులు భారీ సంఖ్యలో పార్టీ విడి..టిడిపిలో చేరారు. వీరందరికి కేశినేని శివనాథ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వైసిపి మేనిఫెస్టో లో జగన్ మూడు రాజధానులని చెప్పడంతో రాష్ట్రాభివృద్ది కాంక్షించే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు టిడిపిలో వచ్చి చేరుతున్నారని తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారన్నారు. గతంలో ఎన్నో మాయమాటలతో ప్రజలను మోసం చేసి ఓట్లు రాబట్టుకున్నజగన్ కి ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిపారు. అధికారంలోకి రాగానే మైనార్టీ సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేస్తారన్నారు.
వైసిపి వీడి టిడిపి పార్టీలో చేరిన వారిలో మైనార్టీ నాయకులు షేక గఫ్పార్, షేక్ ఏసుబ్, మహ్మాద్ ఫయాజ్, మహ్మాద్ అయాజ్, షేక్ అల్లాభక్షు, సలీమ్ వున్నారు. అలాగే బిసి నాయకులు రామ కిషోర్, సురేష్, నక్కా అరవింద్, యశ్వంత్, ప్రసాద్, దాడి కుమార్, నక్కా రమేష్, దాస్ జోసప్, యూత్ వింగ్స్ ప్రెసిడెంట్స్ రసూల్, తేజ, హరి, నాగరాజు, మోహిత్,వీర్ల దినేష్, సమీర్, అదిల్ తోపాటు వీరికి మద్దతుగా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా వున్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్.బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పెటేటి రాజమోహన్, టిడిపి నాయకులు నహీద్ అంజూమ్, పలెవెల బుజ్జి, పైడ ముక్కల రాజు, దాడి గంగాధర్, పైడముక్కల సుధీర్, హుజుర్ సునీల్ లతో పాటు మైనార్టీ, బిసి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.