ఇంద్రకీలాద్రి కె.ఎస్ రామరావుసందర్శించారు.ఈ సందర్భంగా వేద పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వేద విద్య, వసతులు

Spread the love


ఇంద్రకీలాద్రి కె.ఎస్ రామరావుసందర్శించారు.ఈ సందర్భంగా వేద పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వేద విద్య, వసతులు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ : 

       పోరంకి నందు ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ వారి స్మార్థ వేద పాఠశాలను ఈరోజున ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు  సందర్శించారు.

      ఈ సందర్భంగా వేద పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వేద విద్య, వసతులు, మరమ్మత్తులు, శానిటేషన్ మొదలగు ఏర్పాట్లు గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారితో, మరియు వేద పాఠశాల సిబ్బంది వారితో కలిసి వేదపాఠశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

అనంతరం, వేసవి సందర్బంగా వేదవిద్యార్థులకు సౌకర్యార్థం వేదపాఠశాల యందు తరగతి గదులు, మరియు రూములలో ఏర్పాటు చేసిన కూలర్లు, ఫ్యాన్ లు, చలువ పందిళ్ళు, శానిటేషన్ తదితరములను కార్యనిర్వాహణాధికారి వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 

    కోర్సు పూర్తి చేసుకోబోతున్న వేదవిద్యార్థులకు ఆలయ పురాణ పండిట్ Ch.వెంకటేశ్వర శాస్త్రి  క్రియా(practical) తరగతులపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఈవో  వేద విద్యార్థులతో ముచ్చటించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహనాధికారి వారితో పాటుగా వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *