టిడిపి ఎన్నికల మేనిఫెస్టో అంతా అబద్ధమే

Spread the love

 

పెన్షన్ల పెంపు హామీని మేనిఫెస్టో నుంచి ఎందుకు తొలగించారో టిడిపి నాయకులు సమాధానం చెప్పగలరా.

వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి

టిడిపి ఎన్నికల మేనిఫెస్టో అంతా అబద్ధమే

టిడిపి ఎన్నికల మేనిఫెస్టోను బిజెపి నమ్మడం లేదు… బోండా ఉమాను టిడిపి క్యాడర్ నమ్మడం లేదు

పాయికాపురం

 టిడిపి ఎన్నికల మేనిఫెస్టో అంతా అబద్ధమే అని.. 2014లో మాదిరిగా ఆచరణకు సాధ్యం కానీ హామీలతో చంద్రబాబు మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. వైఎస్ఆర్సిపి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్లో సోమవారం ఆయన పర్యటించారు. కేశినేని నాని అల్లుడు కాజా రఘునాదం, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి లతో కలిసి శాంతినగర్, శారద విద్యాలయం రోడ్డు, భాస్కరరావు కొట్టు సెంటర్ ప్రాంతాల్లోనే ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అంతా అబూత కల్పనే అని, ఇది ఆచరణకు ఏమాత్రం సాధ్యపడవని వివరించారు. చంద్రబాబు హామీలను అతని మిత్రపక్షమైన బిజెపి నే నమ్మడం లేదని, ఇక ప్రజలు ఎందుకు నమ్ముతారని ఎద్దేవా చేశారు.

జగనన్న వెంటే జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజల అభ్యున్నతికి ఎంతో దోహద పడ్డాయని.. ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమంతా జగనన్న అంటే నడుస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బెల్లంపల్లి శ్రీనివాసరావు సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని సెంట్రల్ నియోజకవర్గంలో కచ్చితంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎల్లంపల్లి శ్రీనివాసరావు అఖండ మెజార్టీతో విజయం సాధించి తీరుతారని, 175 నియోజకవర్గాల్లో మొట్టమొదట గెలిచే ఎమ్మెల్యే సీటు వెల్లంపల్లిదేనని వివరించారు.బోండా ఉమాను తన క్యాడరే నమ్మడం లేదు.

బోండా ఉమాను సొంత క్యాడరే నమ్మడం లేదని, టీడీపీ నుండి వైస్సార్సీపీ లోకి చేరుతున్న వందలాది కార్యకర్తలే దీనికి నిదర్శనం అన్నారు. ఉమాను ఆయన కార్యకర్తలే నమ్మలేనప్పుడు నియోజకవర్గ ప్రజలు ఎందుకు నమ్ముతారని, ఉమాకి ఘోర ఓటమి తప్పదన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు బల్లం కిషోర్, నాలం బాబు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *