సుజనాను 15వేల ఆధిక్యంతో గెలిపిస్తాం బీజేపీ నేత బుల్లా

Spread the love

 సుజనాను 15వేల ఆధిక్యంతో గెలిపిస్తాం

బీజేపీ నేత బుల్లా

విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని 15 వేల మెజారిటీతో గెలిపించుకుంటామని బీజేపీ నేత బుల్లా విజయ కుమార్ అన్నారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో శుక్రవారం మాట్లాడారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తాము పార్టీ వృద్ధి కోసం ఎంతో శ్రమించానని, అయితే తర్వాత పార్టీ లోకి వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చి తనను అవమానించారని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఆత్మాభిమానం చంపుకోలేక తాను తన క్యాడర్ బీజేపీలో చేరామని తెలిపారు. రెండు డివిజన్లలో తాను కార్పొరేటర్ గా గెలిచి ప్రజల మన్ననలు పొందానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ, బీసీ వర్గాల్లో తనకు వున్న ప్రజాదరణతో సుజనా చౌదరిని కనీసంగా 15వేల మెజారిటీతో గెలిపించుకుంటామని విజయ్ కుమార్ తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *