వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి
టిడిపి పార్టీకి చెందిన నాయకులు కూడా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించామని వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. స్థానిక 1వ. డివిజన్ ఆదర్శనగర్ పరిసర ప్రాంతాలలో వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె సాయి అశ్విత, కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ, పథకాలు అభివృద్ధి పనులు జరుగుతాయని, చంద్రబాబు కచ్చితంగా వాలంటరీ వ్యవస్థని పూర్తిగా విస్మరిస్తారని చెప్పారు. అబ్బా తాతలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ ప్రజల ముందుకు తీసుకువచ్చారని చెప్పారు. రెండు నెలలు నుండి చంద్రబాబు పెన్షన్ దారులను పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. చంద్రబాబు మాటలకే పరిమితం అని… చేతల విషయంలో ఆయన వెన్ను చూపిస్తారని చెప్పారు. ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ప్రజల నుండి పూర్తిస్థాయిలో ఆదరణ లభిస్తుందన్నారు. పేద ప్రజలు అంటే గౌరవం లేని వ్యక్తి బోండా ఉమా అని చెప్పారు టిడిపిని రాబోవు రోజుల్లో ప్రజలు కచ్చితంగా చెత్తబుట్టకే పరిమితం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.