పోతిన మహేష్ కామెంట్ కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ 88 అసెంబ్లీ స్థానాలని కోల్పోయింది

Spread the love

 కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబు నాయు

డుకి పవన్ కళ్యాణ్ కి పురందరిశ్వరికి శుభాకాంక్షలు.

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

జనం కోసం జగన్ జగన్ కోసం జనం

కచ్చితంగా జగన్ నిలబడతారు మరల ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారు.

కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ 88 అసెంబ్లీ స్థానాలని కోల్పోయింది.

 10 లక్షల ఓట్లు వచ్చి ఉంటే వైఎస్ఆర్సిపి 100 సీట్లతో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేవారు.

వైఎస్ఆర్సిపి పార్టీ 5000 ఓట్ల తేడాతో 19 సీట్లు, 10000 ఓట్ల తేడాతో 28 సీట్లు, 15000 ఓట్ల తేడాతో 41

 స్థానాలని అంటే 10 లక్షల ఓట్ల తేడాతో 88 స్థానాలని కోల్పోయింది.

ఈ 88 స్థానాలకి వచ్చిన 11 స్థానాలు కలుపుకుంటే 99 నుంచి 100 స్థానాలతో మరొకసారి అధికారంలోకి వచ్చేది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూటమి చేస్తున్న విషప్రచారంలో వాస్తవం లేదు .90 వేల పైచిలుకు మెజార్టీ వచ్చిన స్థానాలు కేవలం 3 మాత్రమే, 50 వేల నుంచి 80 వేల లోపు వచ్చిన మెజారిటీలు 27 స్థానాలు మాత్రమే.

వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోవడానికి ప్రధానంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయకపోవడం, నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం మాత్రమే.

కూటమి ఏమన్నా శాశ్వతమా అవసరాలను బట్టి ప్రాధాన్యతలను బట్టి కోటమిలు ఏర్పడతాయి 2014లో కలిసి పోటీ చేశారు 2019 లో విడిపోయారు 2024 లో కలిశారు 2029 లో కలిసుంటారని గ్యారెంటీ ఏమిటి? 

కూటమిపాలన ప్రచారం చేయకంగా ఉంటుందా లేక పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందో అనే విషయం అతి తొందర్లోనే ప్రజలకు చాలా తొందరగా అర్థం అవుతుంది. 

ప్రతి కార్యకర్త పాలన ఉండదని మాట్లాడుతూనే గెలిచి 24 గంటలు కాకముందే ప్రతీకార దాడులు చేస్తున్నారు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో. 

జగన్మోహన్ రెడ్డి పేద సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నందుకే వారిపై కూటమి విషప్రచారం చేసింది ఆ ఉచ్చులో ప్రజలు పడ్డారేమో అని అనిపిస్తుంది. 

అభివృద్ధి అంటే ఆకాశాన్ని అంటే బిల్డింగులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్న వాస్తవం ప్రజలకి అతి తొందర్లోనే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి పేద సామాన్య వర్గాల జీవన ప్రమాణాల పెంపు కోసం విప్లవాత్మకంగా తెచ్చిన పథకాల విలువ అర్థమవుతుంది.

జగన్ విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ,అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, చిన్న జిల్లాల ఏర్పాటు, వాలంటరీ వ్యవస్థ, సెంటు భూమి, అమరావతిలో ఇళ్ళ పట్టాలు కూటమి కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందో చూద్దాం.

*పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడ.*

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *