అమ్మవారిని దర్శించుకున్న ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని) దేవాలయాలలో ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా దర్శనం

Spread the love

13-06-2024 

అమ్మవారిని దర్శించుకున్న ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని)

దేవాలయాలలో ప్రత్యేక పూజలు

కుటుంబ సమేతంగా దర్శనం

 

విజయవాడ : ఎం. పి  హోదాలో తొలిసారి గా కేశినేని శివనాథ్ ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మవారిని, శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం లో వినాయక స్వామిని  కుటుంబ సమేతంగా   గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

 అనంతరమే ఎం.పి  అభ్యర్థి గా కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు  చేయటం జరిగింది. ఎం.పి గా కేశినేని శివనాథ్  భారీ మెజార్టీ తో గెలవటం తో  ఈ రెండు ఆలయాలను దర్శించి   మొక్కులు చెల్లించటం జరిగింది.  

 కేశినేని శివనాథ్ కు కనకదుర్గమ్మ ఆలయ ఈ.వో  కె.ఎస్  రామారావు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా, ఆలయ ప్రధాన అర్చకులు వేదం మంత్రోచ్చారణ తో ఆహ్వానం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేయగా,  ఆలయ ఈ.వో  కె.ఎస్  రామారావు  అమ్మవారి చిత్రపటాన్ని కేశినేని శివనాథ్  కు  అందజేశారు. అమ్మవారి 

 చల్లని  ఆశీస్సులు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని,  రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అభివృద్ధి పథంలో పయనించే విధంగా ఆశీర్వదించాలని  ప్రార్ధించినట్లు  ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)  తెలిపారు. 

అంతకుముందు కెనాల్ రోడ్ లోని  శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయకుడిని ఎంపీ కేశినేని శివనాథ్  కుటుంబ  సమేతంగా  దర్శించుకుని    ప్రత్యేక పూజలు నిర్వహించటం  జరిగింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *