23-04-2024
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని
ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందకు ఢిల్లీ వెళ్లిన విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పద్మ విభూషణ, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును మర్యాద పూర్వకంగా ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలవటం జరిగింది. వెంకయ్యనాయుడుకి కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందించి ఆశీస్సులు అందుకున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీ సాధించినందుకు అభినందించారు. అనంతరం ఇద్దరు రాష్ట్ర పరిస్థితులపై, కేంద్రం నుంచి అవసరమైన నిధుల సేకరణ గురించి చర్చించుకున్నారు.