అందరికీ అందుబాటులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం వైకాపా దుష్ప్రచారాలు పై తెదేపా నేత యేదుపాటి రామయ్య ఆగ్రహం

Spread the love

 అందరికీ అందుబాటులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం వైకాపా దుష్ప్రచారాలు

పై తెదేపా నేత యేదుపాటి రామయ్య ఆగ్రహం 

విజయవాడ జూన్ 25.

పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం అందిస్తున్న సేవలు పై

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను  

తెలుగుదేశం పార్టీ

నేత ఆ పార్టీ మీడియా సెల్ ఇంచార్జ్ 

యేదుపాటి రామయ్య 

తీవ్రంగా ఖండించారు. 

నియోజకవర్గంలోని భవానిపురం లో గల ఎన్డీఏ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీపై స్పందిస్తూ తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తూ చేస్తున్న సేవా కార్యక్రమాలు రామయ్య తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో తొలి నుంచి ఎన్నికల ప్రచార సందర్భంలోనూ సుజనా చౌదరి పై అవాస్తవాలు ప్రచారం చేసిన సందర్భాలను సందర్భాలు రామయ్య గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నారని ఇప్పటికే ఇందుకుగాను ప్రణాళికలు రూపొందించినట్లు తెలియజేశారు. 

 ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఎన్డీఏ కూటమి నేతలతో

సమన్వయంతో వ్యవహరిస్తూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని రామయ్య స్పష్టం చేశారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *