ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజన ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా గురువారం సృజన బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేశారు. ఆలయం తరుపున కార్య నిర్వహణ అధికారి రామారావు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజా ఆరోగ్యమే తన ప్రధమ లక్ష్యమని అన్నారు. నగరంలో డయేరియా ప్రభలిందన్న దానిపై పూర్తి నివేదిక తెప్పించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా నగరపాలక సంస్థకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.