అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్

Spread the love

విశాఖపట్నం సిటీ

తేదీ 26-06-2024

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఆర్.కే బీచ్ నందు నగర పోలీసులు నిర్వహించిన అవేర్నెస్ మార్చ్ నందు రాష్ట్ర హోం మంత్రివర్యులు  వంగలపూడి అనిత  ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగినది.

ఈ రోజు ఉదయం కాళీమాత మందిరం నుండి వై.ఎం.సి.ఏ వరకూ నిర్వహించిన ఈ అవేర్నెస్ మార్చ్ ప్రారంభ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ తో పాటుగా అడిషనల్ కలెక్టర్ (ఇంచార్జి) మయూర్ అశోక్, ఐ.ఎ.ఎస్.,  టి.డి.పి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక (MLA)  పల్లా శ్రీనివాసరావు  నార్త్ (MLA)  విష్ణు కుమార్ రాజు  జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ Dr. కే.ఫక్కిరప్ప, ఐ.పీ.ఎస్., ,డి.సి.పి(క్రైమ్స్) పి.వెంకట రత్నం ,డా ఎస్.విజయ్ కుమార్, ఏ.డి(డ్రగ్స్)  నగర పోలీసు ఉన్నతాధికారులు, మహిళా పోలీసులు, హోం గార్డ్స్, పలు కళాశాల విద్యార్థులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఈ  అవేర్నెస్ మార్చ్ ప్రారంభ కార్యక్రమంలో వరుసగా నార్త్ (MLA)  విష్ణు కుమార్ రాజు గాజువాక (MLA)  పల్లా శ్రీనివాసరావు  తమ సందేశాలను అందజేశారు, అనంతరం అడిషనల్ కలెక్టర్ (ఇంచార్జి) మయూర్ అశోక్, ఐ.ఎ.ఎస్. తమ సందేశం తెలిపారు. అనంతరం నగర పోలీసు కమిషనర్  మాట్లాడుతూ హోం మంత్రి మొదటగా అదేశించినది రాష్ట్రంలో గంజాయి ఇతర డ్రగ్స్ రాష్ట్రంతో పాటుగా నగరంలో పూర్తి గా నిర్వీర్యం చేయాలని, అందుకు వెంటనే అన్ని శాఖలతో సమావేశం ఏర్పాటు చేసి తగు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలిపారని అందుకు అనుగుణంగా  100 రోజుల యాక్షన్ ప్లాన్ తో నగర వ్యాప్తంగా గంజాయి ఇతర డ్రగ్స్ ను సమూలముగా అరికట్టే చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.

ముఖ్య అతిథి, రాష్ట్ర హోం మంత్రివర్యులు  వంగలపూడి అనిత మాట్లాడుతూ హోం మంత్రి గా ఛార్జ్ తీసుకున్న మరుక్షణం నుండి రాష్ట్రంలో గంజాయి ఇతర డ్రగ్స్ సమూలముగా లేకుండా చేయాలనీ అడుగులు వేస్తున్నానని, విశాఖను అద్భుత నగరం గా అభివర్ణిస్తారనీ, అటువంటి విశాఖను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేద్దామని, అది పోలీసులతో పాటుగా ప్రతీ వ్యక్తి, విద్యార్థి, యువత,ప్రజలందరూ అందరం తమ వంతుగా సహకరించి, పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ద్వారా తగు సమాచారం ఇవ్వాలని తెలిపారు, విద్యార్థి దశ నుండే యువతకు డ్రగ్స్ దుష్పరిణామాలు పట్ల పూర్తి అవగాహన చేయాలని  యువత,విద్యార్థులు వీటికి దూరంగా ఉంటూ వారి భవితకు బంగారు బాటలు వేసుకోవాలని, ఇప్పటికే డ్రగ్స్‌ నియంత్రణకు 100 రోజుల సత్వర ప్రణాళిక అమలు చేశామని తెలిపారు.

అనంతరం అవేర్నెస్ మార్చ్ చేయబోవు సుమారు 1000 మందితో  హోం మంత్రివర్యులు అందరూ మాదకద్రవ్యాలకు దూరముగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించి, జెండా ఊపి  అవేర్నెస్ మార్చ్ ప్రారంభించారు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్.,  ఆధ్వర్యంలో ఆర్.కే బీచ్ నందు నగర పోలీసులు నిర్వహించిన ఈ అవేర్నెస్ మార్చ్ విజయవంతముగా ముగిసినది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *