కెఎల్ యులో వెబైల్ యాప్స్ సెంటర్ ఆఫ్ డిజిటల్ అండ్ ఎఐ ఎక్సలెన్స్ నూతన కార్యాలయం ప్రారంభం.
కెఎల్ యు – ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ మోడల్‌కు నూతన ఆరంభం.*కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో కెఫిన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ వెబైల్ యాప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ డిజిటల్ అండ్ ఎఐ ఎక్సలెన్స్ (సిఒడిఇ ) ను ప్రారంభించారు. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు ఎఐ మరియు డిజిటల్ టెక్నాలజీలపై ప్రత్యక్ష పరిశ్రమ అనుభవం లభించనుంది. ఇది విద్యా మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడంలో కీలకమైన ముందడుగు అని వెబైల్ యాప్స్ సీఈఓ నజీష్ మీర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సిఒడిఇ కేంద్రం ద్వారా విజయవాడను డిజిటల్ మరియు ఎఐ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. దీని ద్వారా వేల సంఖ్యలో అధిక నైపుణ్య ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న ప్రతిభవంతులైన విద్యార్దులను తయారుచేసే ప్లాట్‌ఫారమ్ ఇది అని తెలిపారు.కెఫిన్ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ శ్రీకాంత్ నాదెళ్ల మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమ-రహిత శిక్షణ ఇవ్వడం ద్వారా సంస్థ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించగల మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిఒడిఇ ప్రత్యేకతల గురించి వివరించారు. విద్యార్థులకు పరిశ్రమ అనుభవం కల్పించే కోర్సుల ఏకీకరణ, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణమైన టెక్ నైపుణ్యాల అభివృద్ధి, విజయవాడను కేంద్రంగా తీసుకున్న శక్తివంతమైన ప్రతిభా పర్యావరణం, సాంకేతికత, కనెక్టివిటీ మరియు మౌలిక సదుపాయాల్లో ప్రాభవం ఉన్న సంస్థల పరిచయం వంటి ఎన్నో అసమానమైన ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. కెఫిన్ టెక్నాలజీస్ గురించి వివరిస్తూ భారతదేశంలో అతిపెద్ద ఇన్వెస్టర్ మరియు జారీదారుల సర్వీస్ ప్రొవైడర్ గా మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్, కార్పొరేట్ బాండ్స్ వంటి డొమైన్లలో పూర్తి సేవలు అందిస్తుందన్నారు. జాతీయ స్థాయిలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బిఎస్ఈలో లిస్టెడ్ సంస్థగా పేరు గాంచిందన్నారు. జనరల్ అట్లాంటిక్ (జిఎ) ప్రైవేట్ ఈక్విటీ ప్రమోటర్ గా ఉందన్నారు. వెబైల్ యాప్స్ అనే సంస్థ 2011లో హైదరాబాలో స్థాపించబడిన టెక్నాలజీ కంపెనీ అని అన్నారు. వెబ్, మొబైల్, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో పూర్తి ఉత్పత్తి, అభివృద్ధి సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేథస్సు (ఎఐ), ఫిన్‌టెక్ మరియు రిటైల్ విభాగాల్లో ప్రత్యేక అనుభవం కలిగిన సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ ఎమ్.వి. నాయర్, జనరల్ అట్లాంటిక్ ఆపరేటింగ్ పార్ట్నర్ శ్రీనివాస్ పెద్దాడ, కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ శ్రీకాంత్ నాదెళ్ల , వెబైల్ యాప్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ నజీష్ మీర్ , కెఎల్ వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి. పార్థ సారథి వర్మ, ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కె. రాజశేఖర రావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.సుమన్, కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీటీఓ వెంకట గిరి వోంకయల , చీఫ్ పీపుల్ ఆఫీసర్ సుజయ్ పుత్రాన్ , వెబైల్ యాప్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భరత్ వైఎన్వీ తదితరులు పాల్గొన్నారు.