42వ డివిజన్లో ప్రజలకు ఇబ్బందిగా మారిన గోతుల సమస్య ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు

Spread the love

 త్రాగునీటి పైపులైన్లు కోసం తీసిన గోతులు

42వ డివిజన్లో ప్రజలకు ఇబ్బందిగా మారిన గోతుల సమస్య 

ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు

 

ఎమ్మెల్యే చొరవతో వెంటనే సమస్యకు పరిష్కారం 

విజయవాడ పశ్చిమ, జులై 3.

త్రాగునీటి పైపులైన్లు కోసం తీసిన గోతులను తిరిగి పూడ్చకపోవడంతో

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. 

42 డివిజన్లో నెలకొన్న సమస్యను మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి విన్నవించారు. 

కార్పొరేషన్ సిబ్బంది త్రాగునీటి పైపులైన్లు వేసే సందర్భంలో తీసిన గోతులను తిరిగి పూడ్చకుండా ఉండటంతో

ఇటుగా వెళ్లే ప్రయాణికులు, పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. 

కార్పొరేషన్ సిబ్బంది తీసిన గోతులను పూడ్చడం తో సమస్య పరిష్కారమైంది.

42 డివిజన్ వాసులు సుజనా చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *