పర్యావరణ పరిరక్షణే లక్ష్యం చెట్లు నాటడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చు హెచ్ బీ కాలనీలో చెట్లు నాటిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

4
0

 పర్యావరణ పరిరక్షణే లక్ష్యం 

చెట్లు నాటడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చు 

హెచ్ బీ  కాలనీలో చెట్లు నాటిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ,  జులై 7.

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని  బాధ్యతగా అందరూ చెట్లు నాటడం అలవర్చుకోవాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 42వ డివిజన్ హెచ్ బి కాలనీలో వాటర్ ట్యాంక్ వద్ద అమ్మ కోసం ఒక చెట్టు  కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొనడం జరిగింది.  కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలనీ 

పిలుపునివ్వడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్న స్థానికులు ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ నెలకొని ఉందని తెలియజేశారు. వాన పడితే చాలు తమ ఇళ్లల్లోకి డ్రైనేజీ లోంచి  నీరు పొంగి పొర్లుతోందని

స్థానిక మహిళలు తమ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. 

కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ అధికారులతో మాట్లాడి డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు .

చెట్లు నాటే కార్యక్రమంలో 

ఎన్టీఆర్ జిల్లా భా జాపా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,  ఆ పార్టీ నేతలు 

బోగవల్లి శ్రీధర్ , బబ్బురి శ్రీరామ్, పైలా సోమి నాయుడు, పొట్టి శ్రీహరి , తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, 

జనసేన నాయకులు తిరుపతి అనూష సురేష్ 

ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here