ఎమ్మేల్యే సుజనా చౌదరి అదేశాల మేరకు , భవనిపురం ఎన్డీయే కార్యాలయం ఉచిత ఇసుక పాలసీ నేపథ్యంలో పశ్చిమ ఎన్డీఏ కార్యాలయం వద్ద సంబరాలు

Spread the love

 విజయవాడ పశ్చిమ 

ఎమ్మేల్యే సుజనా చౌదరి అదేశాల మేరకు , భవనిపురం ఎన్డీయే కార్యాలయం ఉచిత ఇసుక పాలసీ నేపథ్యంలో పశ్చిమ ఎన్డీఏ కార్యాలయం వద్ద సంబరాలు

గత ఐదు సంవత్సరాలుగా జగన్ రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియాను నడిపించి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేక్ స్పష్టం చేశారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో జగన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. ఇకనుండి రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వంలో పడ్డ కష్టాలు ఉండవని, ప్రజలు సుఖశాంతులతో జీవించేలా ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నేటి నుండి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు, యెదుపాటి రామయ్య ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ ఎన్ డి ఏ కార్యాలయం వద్ద సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ హాజరై సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బేక్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు ఉండవని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కడ ఇసుక కనబడితే అక్కడ తన గుండాల ద్వారా, రౌడీల ద్వారా మాఫియా రాజ్యాన్ని జగన్ నడిపించారని, ఇసుక మాఫియా వల్ల భవన నిర్మాణ రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వారి కష్టాలు తీరిపోయాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణరంగం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఎన్ డి ఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. టిడిపి నాయకులు ఎదుపాటి రామయ్య మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ నేటి నుండి అమల్లోకి రావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ రంగం హర్షం వ్యక్తం చేస్తుందని, సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు బొర్రా భాను శ్రీరామ్ , చంద్ర అఖిల్, చరణ్ సాయి , మహేశ్, నవీన్, టిడిపి కార్యకర్తలు వెంకట రావు , మాయణం పతి నాయుడు , జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *