మంచినీటి పైపులైన్లు బాగు చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలు

Spread the love

 మంచినీటి పైపులైన్లు బాగు చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలు

47వ డివిజన్లో మంచినీటి పైపు లైన్లకు మరమ్మతులు

విజయవాడ పశ్చిమ, జూలై 11.

ఇటీవల మంచినీటి పైపు లైన్లకు సంబంధించిన సమస్యలపై కార్పొరేషన్ అధికారులకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో త్రాగునీటి పైపులైన్లు అని సక్రమంగా ఉన్నాయా ..లేవా.. అని ఎమ్మెల్యే ఆరా తీశారు. 

పలు ప్రాంతాల్లో త్రాగునీటి పైపులైన్ల సమస్య నెలకొని ఉందని స్థానికుల నుంచి వచ్చిన విన్నపాలు సేకరించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. 47 వ డివిజన్ కె ఎల్ రావు నగర్ ప్రాంతంలో చిన్న చర్చి , అడ్డ రోడ్డు ప్రాంతంలో మంచినీటి పైపులు సమస్య ఉందని సంబంధిత పైపులైన్లు కు మరమ్మత్తులు చేయించాలని 47 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మక్కెన భాస్కర్ కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి సంబంధిత అధికారులకు త్రాగునీటి పైపులైన్లు కు మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. కార్పొరేషన్ సిబ్బంది కే ఎల్ రావు నగర్ చిన్న చర్చి అడ్డ రోడ్డు ప్రాంతంలో త్రాగునీటి పైపులైనుకు సంబంధించి మరమ్మతులు చేపట్టారు. *స్థానికులు తమ సమస్య పరిష్కరించిన సుజనా చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *