త్రాగనీటి సరఫరాని నిరంతరం పర్యవేక్షిస్తుండండి ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు

7
0

 విజయవాడ నగరపాలక సంస్థ 

11-07-2024

త్రాగనీటి సరఫరాని నిరంతరం పర్యవేక్షిస్తుండండి

ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు

 విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ Dr ఏ మహేష్ గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ బూస్టర్ పంప్ హౌస్, కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్,56 డివిజన్ మరియు APIIC కాలనీ లో పర్యటించి అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

 ముందుగా చిట్టి నగర్ లో ఉన్న   బూస్టర్ పంపును పరిశీలించారు ప్రజలకు త్రాగునీటి సరఫరా లో  ఎటువంటి ఇబ్బందులు కలగకుండా  చూసుకోవాలని అధికారులకు అదేశాలు ఇచ్చారు.

 తదుపరి కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ లో  చీఫ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లతో  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం  56వ డివిజన్లో క్షేత్రస్థాయిలో పర్యటించి  ఇంటింటిలో నీటి నమూనాలను సేకరించి క్లోరిన్ రెసిడ్యుఅల్ పరీక్షలను నిర్వహించారు.

 నీటి సరఫరా చేసే ఏ ప్రదేశంలో అయినా ఎటువంటి కలుషితం లేకుండా నిరంతరం పరీక్షలు నిర్వహించేటట్లుగా ఎప్పటికప్పుడు పటిష్టంగా పర్యవేక్షణ చేస్తూ సైడ్ డ్రైన్ లల్లో  త్రాగునీటి పైపులు కలవకుండా అసిస్టెంట్ ఇంజనీర్లు జూలై 20 కల్లా తమ పరిధిలో ఎటువంటి త్రాగునీటి పైప్లైన్లు డ్రైన్ ల వద్ద కలుషితం జరగటం లేదని ధ్రువీకరించాలని, అసిస్టెంట్ ఇంజనీర్ల దగ్గరుండి సేకరించిన ఆ ధ్రువీకరణ పత్రం ని, డీ ఈ లు నిర్ధారించాలని, వాటిని చివరిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అందరు ధృవీకరించి ఆ పత్రాలను సమర్పించాలని  అన్నారు.

 ధ్రువీకరించిన తర్వాత ఎక్కడైనా సరే డ్రైన్ లో త్రాగునీటి  పైపులైన్లు కనబడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 తదుపరి APIIC కాలనీలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్యని నిర్వహణ ఎప్పటికప్పుడు సరిగ్గా నిర్వహించాలని. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని. కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని ప్రజా ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.

 ఈ పర్యటనలో కమిషనర్ గారితో పాటు చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వన్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వన్ డాక్టర్ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here