విజయవాడా పట్టణం లో యనమలకుదురు ఊరు లో అశోక్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులకు సైన్వ్ పట్ల
అవగాహన, మేధో శక్తిని పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ వంటి అంశాలపై రెండు రోజుల పాటు పూర్తిస్తాయి వర్క్ షాప్ నిర్వహించారు. శుక్రువారం ఈ విషయంపై కరస్పాండెంట్ పి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆంద్ర ప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో , విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరిగింది అని తెలిపారు ఈ రెండు రోజులు కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రోబోట్లు పనిచేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వివరించామన్నారు. విద్యార్థులకు మదర్ బోర్డ్, అత్యవసర రిమోట్ సెన్సార్ కిట్స్ వంటివి అందజేసి స్వయంగా వస్తువులను తయారు చేసే విధంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని ప్రిన్సిపాల్ పి శృతిక తెలియజేశారు. విద్యార్థులకు సైన్స్ అంశాల పట్ల సమాజానికి ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం పట్ల అవగాహన, శిక్షణ, పరిజ్ఞానం అందించడం ద్వార భవిష్యత్తులో వారు సరైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం బోట్ లివ్ సంస్థ ప్రతినిధులు, అధ్యాపకులు విధ్యార్థులు పాల్గొన్నారు.