Home Andhra Pradesh వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి TV5 సూటి ప్రశ్నలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి TV5 సూటి ప్రశ్నలు

2
0

 *వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి TV5 సూటి ప్రశ్నలు

*

ఆదిత్య హృదయం ప్రతినిధి

– ఆరోపణలెవరివి? నువ్వు ప్రశ్నించేదెవరిని విజయసాయిరెడ్డి? 

– మహిళ భర్త మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదునే చూపించాం

– ఫిర్యాదులో ఆయన పేర్కొన్న అంశాలనే వార్తగా చూపించాం

–  ఫిర్యాదులో అంశాలనే ప్రస్తావించాం తప్ప మేం చేసిన ఆరోపణలు కాదు కదా? 

– అసలు నువ్వు సమాధానం చెప్పాల్సింది మదన్ మోహన్‌కి కదా?

– మహిళతో నీకెటువంటి సంబంధం లేదని నువ్వే నిరూపించుకోవాలి కదా?

– అసలు మీ సంబంధాలతో మీడియా కి ఏంటి సంబంధం?

– మీరెవరితో ఎలాంటి సంబంధాలు కలిగున్నారో చర్చించే తీరక టీవీ5కి లేదు

– మీరు ఎలాంటి వారో.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో  జనాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు విజయసాయిరెడ్డి

– విశాఖ, నెల్లూరు, ఢిల్లీ.. ఇలా అనేక ప్రాంతాల్లో మీ గురించి అనేక ప్రాంతాల్లో అనేక కథలు వినిపిస్తున్నాయి 

– వాటి గురించి TV5 ఏం మాట్లాడలేదే? 

– ఇప్పుడు జరుగుతుంది ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపైనే చర్చ

– దానికే మీరు వివరణ ఇవ్వాలి విజయసాయిరెడ్డి

– ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మరింత నిజాయితిగా ఉండాలి అదే జనం కోరుకుంటున్నారు

– ఆ మహిళతో మీకు ఎలాంటి సంబంధం లేదని.. మదన్ మోహన్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పుకునే ప్రయత్నాలు చేసుకో

–  కానీ ఇదంతా మీడియానే చేసిందనే రీతిలో అక్కసు ఎందుకు? 

– ఆరోపణలు ఎదుర్కొన్న మహిళ వెర్షన్ కూడా టీవీ5 ప్రసారం చేసింది

– మీ వివరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేశాం

– మేము మీడియాగా మా బాధ్యతను నిర్వహించాం నిర్వహిస్తాం

– ఓ వ్యక్తి మీ వ్యక్తిగత జీవితంపై ఆరోపణ చేస్తే.. ఆ రీతితోనే సమాధానం చెప్పాలి 

– ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి సమాజానికి కూడా సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంటుంది

– మీకు చేతనైతే ఆ పనిచేయండి అంతేకాని మీడియాపై నిరాధారణ ఆరోపణలు తగవు విజయసాయిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here