గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు

Spread the love

 గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు

గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ASP , Sri NACHIKET SHELKE, I.P.S.,  ఆదేశాల మేరకు, లాలాపేట పోలీస్ స్టేషన్ CI పి. దేవ ప్రభాకర్  ఆద్వర్యములో SI M.సుబ్బారావు  మరియ వారి సిబ్బంది లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పీకలవాగు కట్ట డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి *రెండు కేజీల గంజాయిని  స్వాదినపరుచుకోవదమైనది. అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకోవడమైనది.

ముద్దాయిల వివరాలు

1) షేఖ్ కరిముల్లా , నల్లచెరువు 25/2 వ లైన్,గుంటూరు టౌన్, 

2) చల్లా ఈశ్వర రావు, నిమ్మలాపేట 1 వ లైన్, నల్లచెరువుగుంటూరు టౌన్ 

3) బత్తుల శ్రావణ్ కుమార్, నల్లచెరువు 18/3 వ లైన్,గుంటూరు టౌన్ 

పై తెలిపిన ముద్దాయిలు చెడు వ్యసనాలకు అలవాటుపడి, గంజాయి సేవించే అలవాటు వుండి. భద్రాచలం మరియు ఒరిస్సా సరిహద్దు ప్రాంతలలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, గుంటూరు తీసుకువచ్చి గుంటూరు మరియు చుట్టుపక్కల ప్రక్కల ప్రాంతాలలో గంజాయి త్రాగుట అలవాటు గల వారికీ అధిక ధరకు అమ్ముచున్నట్లు, అదేవిధముగా ఈ రోజు కుడా పైన తెలిపిన ముద్దాయిలు గంజాయిని పీకలవాగు కట్ట డంపింగ్ యార్డ్ వద్ద అమ్ముచున్నట్లు సమాచారము తెలుసుకొని CI పి. దేవ ప్రభాకర్  ఆదేశాలు మేరకు SI M.సుబ్బారావు  మరియ వారి సిబ్బంది ముగ్గరు ముద్దాయిలను మరియు ఒక మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకోని వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయిని* స్వాదినపరుచుకొని ముద్దాయిలను రిమాండ్ కు పంపడమైనది. ఈ కేసులో పూర్వ పరాలకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది.  

అదేవిధముగా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి/ మాదకద్రవ్యాల కలిగివుండి, గంజాయి క్రయ విక్రయాలు జరిపిన, సేవించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుందని ఈ సందర్భంగా లాలాపేట ఇన్స్పెక్టర్ శ్రీ పి. దేవ ప్రభాకర్  తెలియపరిచినారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *