విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ పీఏసీచైర్మన్,

Spread the love

 విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ పీఏసీచైర్మన్,

జనసేన క్రియాశీలక సభ్యత్వం. ఓ ఎమోషన్ కార్యకర్తల క్షేమమే ధ్యేయంగా కార్యక్రమం

క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తల కుటుంబాల్లో ధైర్యం, భరోసా నింపగలిగాం ఈ ప్రక్రియలో ప్రజల్ని సైతం భాగస్వాముల్ని చేయాలి

పవన్ కళ్యాణ్ నిస్వార్థ పోరాటాన్ని ప్రజలు ఆదరించారు. జన సైనికులను, వీర మహిళలను ఇబ్బందిపెట్టినవారిని విడిచిపెట్టం

కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ప్రతి కార్యకర్తకీ పార్టీ అండగా నిలుస్తుంది

దిశ, ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ‘జనసేన “క్రియాశీలక సభ్యత్వం ఒక భావోద్వేగంతో కూడుకున్న అంశం. పార్టీ కోసం కష్టపడిన ప్రత్తి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా స్వీకరించి కష్టకాలంలో వారికి అండగా నిలవాలన్న మనోహన్నత లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  మూడేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా 10 ద్వారా పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తలో ధైర్యం, నింపగలిగాం. అటు జనసైనికులు, వీర మహిళలు సైతం ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అది ఈ రోజున పెద్ద దిక్కు కోల్పోయిన 144 కుటుంబాలకు అండగా నిలిచేలా చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జనసేన నాదెండ్ల మనోహర్  స్పష్టం చేశారు. జన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమ ఆవశ్యకతను ప్రజలకు వివరించి వారిని కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడకు చెందిన జన సైనికుడు వటాల హరిప్రసాద్,  నాగమణి దంపతులకు తోలి సభ్యత్వాన్ని అందచేశారు. రాజగిరి సోమేశ్వర రావు, కమళ్ళ సోమనాథంలకు సభ్యత్వాన్ని సభ్యత్వాలు అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్  కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ “కార్యకర్తల కోసం భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆపత్కా కాలంలో వారి కుటుంబాలకు రక్షణ కల్పించేందుకు, ధైర్యం నింపేందుకు వారిని గౌరవించుకోవాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం కోవిడ్ కష్టకాలంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మొదటి ఏడాది లక్ష రెండో ఏడాది మూడున్నర లక్షలు, లు, గత ఏడాది 6477 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ ఏడాది 10 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పెట్టుకున్నాం. గడచిన మూడేళ్లలో రూ.20 కోట్లు పరిహారంగా ఆయా కుటుంబాలకు అందచేశాం. గత మూడేళ్లుగా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కొనసాగించేందుకే తెనాలి కృషి ఆనవాయితీని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని

ప్రారంభించేందుకు వచ్చాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల సభ్యత్వాలు నమోదు చేసేలా ప్రతి ఒక్కరు చేయాలి. ప్రభుత్వానికీ. ప్రజలకీ మధ్య వారధులుగా నిలవాలి సభ్యత్వాలు చేయించారు. వృద్ధులు కూడా ఇది నా పార్టీ అని సభ్యత్వం తీసుకున్నారు. అలాంటి వారందరికీ

భరోసా కల్పించేందుకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుంది.

వ్యక్తుల వల్లే వ్యవస్థలు నిలబడవు

విజయవాడలో మనకు జరిగింది. అన్యాయం నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్లిపోయాడు అని కొంత మంది

అడిగారు. నన్ను ఆ నష్టాన్ని భర్తీ చేసేలా నూతన నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నాము పార్టీకి వ్యక్తులు ముఖ్యమే.

కానీ వ్యక్తుల వల్లే వ్యవస్థ నిలబడదు, నిజాయతీగా నిలబడిన వారికి వ్యవస్థ అండగా నిలుస్తుంది. వ్యక్తిగత

స్వార్ధాలకుపోయి దూషించే ప్రణాళికలతో ముందుకు వెళ్తే నష్టం వారికే, గత్ ఐదేళ్లు మూర్ఖపు ప్రభుత్వంపై

పోరాటం చేశామంటే అది జన సైనికులు, వీర మహిళల వల్లనే, కేసులు పెట్టినా, బెదిరింపులకు దిగినా ఎవ్వరూ

గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతో పార్టీని నడిపిస్తున్నారు. అందుకే గత ఆరేళ్లుగా మనం చేస్తున్న పోరాటాలను ప్రజలు కూడా ఆదరించారు. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం. జన సైనికులు తెలుసుకోవాలి. సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించడంలో పాలుపంచుకోవాలి. పది మందికీ ఉపయోగపడే విధంగా ఆదర్శవంతంగా నిలబడాలి. అదర్శవంతంగా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ గత నెల రోజుల పాలనలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు అండగా నిలబడుతుంది. కూటమి భవిష్యత్తులో మరింత బలంగా ప్రజలకు ఉపయోగపడే  కార్యక్రమాలను చేపడుతుంది ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి జనసేన పార్టీ ఎంతో మంది సామాన్యులు ఇచ్చిన స్పూర్తితో ముందుకు వెళ్లోంది. ఇప్పటం సభ సమయంలో నరసారావుపేట ప్రాంతానికి చెందిన ఒక తాపే మేని మేస్త్రి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తం తన ఇద్దరు పిల్లల చదువు కోసం ఖర్చు చేయమని సలహా ఇస్తే. పార్టీ కూడా నా బిడ్డతో సమానం సర్ అన్న ఆయన మాటలు మనందరికీ స్పూర్తిదాయకం, అమలాపురంలో ఒక ట్యాక్సీ డ్రైవర్, ఉదయం టాక్సీ నడుపుకుంటూ సాయంత్రం సభ్యత్వ నమోదు చేయించేవారు. తెనాలి లో నియోజకవర్గంలో  ‘ఒక టైలర్ తన వృత్తి తోపాటు క్రియశీల సభ్యత్వం ఏర్పటానికి కృషి చేశాడు పార్టీకి వ్యక్తులు ముఖ్యమే.

కానీ వ్యక్తుల వల్లే వ్యవస్థ నిలబడదు, నిజాయతీగా నిలబడిన వారికి వ్యవస్థ కి వ్యవస్థ అండగా నిలుస్తుంది. వ్యక్తిగత స్వార్ధాలకుపోయి దూషించే ప్రణాళికలతో ముందుకు వెళ్తే నష్టం వారికే, గత్ ఐదేళ్లు మూర్ఖపు ప్రభుత్వంపై

పోరాటం చేశామంటే అది జన సైనికులు, వీర మహిళల వల్లనే, కేసులు పెట్టినా, బెదిరింపులకు దిగినా ఎవ్వరూ

గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతో పార్టీని నడిపిస్తున్నారు. అందుకే గత ఆరేళ్లుగా మనం చేస్తున్న పోరాటాలను ప్రజలు కూడా ఆదరించారు. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం. జన సైనికులు తెచ్చుకోవాలి. సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించడంలో పాలుపంచుకోవాలి. పది మందికీ ఉపయోగపడే విధంగా ఆదర్శవంతంగా నిలబడాలి. దర్శవంతంగా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ గత నెల రోజుల పాలనలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు అండగా నిలబడుతుంది. కూటమి భవిష్యత్తులో మరింత బలంగా ప్రజలకు ఉపయోగపడే ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి జనసేన పార్టీ ఎంతో మంది సామాన్యులు ఇచ్చిన స్పూర్తితో ముందుకు వెళ్లోంది. ప్రజా సమస్యలపై వెనకడుగు వేయలేదు. పార్టీలో అందరికీ గుర్తింపు ఇస్తుంది గతంలో ఒక్క సీట్ కూడా లేదు అని ఎంతో మంది మాట్లాడారు. ఇప్పుడు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు, ఒక ఎమ్మెల్సీ స్థానంతో పార్టీ బలంగా ఎదిగింది. జనసేన న పార్టీ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బలంగా పోటీ చేయనున్నా న్నాం, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉమ్మడిగా బలంగా కిష్టపడి జనసీనకు బలమైన గెలుపు అందించాలి. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి గుర్తింపు వస్తుంది. నామినేటెడ్ పదవుల కోసం కంగారు పడవద్దు అందరికీ గుర్తింపు అందేలా చూసే భాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఎక్కడ ఎవరు ఎలా పని చేశారన్న వివరాలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి ప్రతీ జన సైనికుడికి భరోసా జనసేన పార్టీది విజయవాడలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వాలి గతంలో ఎవరైతే మన జనసైనికులు, నాయకులపై దాడులు చేశారో. ఇబ్బందులు పెట్టారో వారిని వదిలి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి. గతంలో

శ్రీకాళహస్తిలో కొట్టే సాయి అనే మన జన సైనికుడిపై పోలీసులు దాడి చేస్తే స్వయంగా చేస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ప్రతి జన సైనికుడికీ అదే విధమైన భరోసా “లభిస్తుంది. పార్టీ మీతో ఉంది. అని తెలియచెప్పడానికే ఇక్కడికి వచ్చాము, మీరు ఎంత క్రీయాశీలకంగా పని చేస్తే పార్టీ నుంచి అంత మద్దతు ఉంటుంది అని అన్నారు. ఇరువురు క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు అనంతరం విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకి చెందిన ఇరువురు జనసైనికుల కుటుంబాలకు 

నాదెండ్ల మనోహర్  రూ. 5 లక్షల బీమా చెక్కులు అందచేశారు. ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన బాయన గోపాలం, శీలం మోహనరావుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి చెక్కులు అందించారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఐటీ విభాగం ఛైర్మన్ మిరియాల శ్రీనివాస్’ కార్యక్రమాల నిర్వహణ విభాగం చైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస్, నివాస్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పార్టీ నాయకులు రావి సౌజన్య  మల్లెపు విజయలక్ష్మి పోతిరెడ్డి అనిత, అజయ్ వర్మ కోప్పిరెడ్డి సూర్యనారాయణ మూర్తి బొలిశెట్టి వంశీకృష్ణ, బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *