రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఎస్.డిల్లీరావు లాభసాటి సాగుకు భూసార పరీక్షలు కీలకం మట్టి నమూనాల పరీక్షలతో కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలి

Spread the love

 *జులై 18, 2024*

లాభసాటి సాగుకు భూసార పరీక్షలు కీలకం

మట్టి నమూనాల పరీక్షలతో కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలి 

అత్యాధునిక భూసార పరీక్షా కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలి 

రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఎస్.డిల్లీరావు

రైతులు పంట వేయడానికి ముందు భూమి స్థితిగతులు తెలుసుకోవడం ముఖ్యమని.. సాగును లాభసాటిగా మార్చుకోవాలంటే భూసార పరీక్షలు చేయించుకుని నిపుణుల సలహాలు పాటించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఎస్.డిల్లీ రావు అన్నారు. గురువారం కమిషనర్ .కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి పరీక్షల్లో సేంద్రియ కర్బనం మోతాదు, నత్రజని, భాస్వరం, పొటాషియం స్థితిగతులు, ఏ మట్టి ఏరకం పంటలకు అనుకూలం వంటివన్నీ తెలుసుకునేందుకు వీలుంటుందని.. ఈ నేపథ్యంలో భూసార పరీక్షలపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన భూసార పరీక్షా కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా

 వ్యవసాయాధికార సిఫార్సులను అనుసరించి సమతుల ఎరువుల యాజమాన్యం చేపట్టవచ్చని.. తద్వారా పంట దిగుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులకు అధిక దిగుబడులు ఆదాయాలు లభించేలా చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉందని ఈ దిశగా రైతులకు వ్యవసాయ అధికారులు మార్గ నిర్దేశం చేయాలని, చేయి పట్టి నడిపించాలని సూచించారు. కమిషనర్ వెంట ఎన్టీర్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.నాగమణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *