హెలికాప్టర్ సాయంతో 25 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చిన జిల్లా యంత్రాంగం.

4
0
హెలికాప్టర్ సాయంతో 25 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చిన జిల్లా యంత్రాంగం.

ఏలూరు/జంగారెడ్డిగూడెం, జూలై, 18… జిల్లా కలెక్టర్ వారి ఆదేశములు మేరకు గురువారం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్లలో గురువారం కురిసిన వర్షముల కారణముగా వేలేరుపాడు మండలం లో కోడిసేల కాలువ అల్లూరి నగర్ వద్ద ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహములో 5 మంది కారులో చిక్కుకొనిన అల్లూరి నగర్ గ్రామస్తులు వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడమైనదని జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య తెలిపారు. జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం వద్ద చిక్కుకొనిన 11 మందిని జేసిబి సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడమైనదన్నారు. జిల్లా కలెక్టర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామములో కట్టమైసమ్మగుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల చిక్కుకున్న ఐదు కార్లు, నాలుగు ఆటోలు, 10 బైకులు మొత్తం 25 మందిని హెలికాప్టర్ సాయంతో రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here