బాధితులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం51 వ డివిజన్ కొండ ప్రాంత బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కార్యాలయం

Spread the love

 బాధితులకు సుజనా 

చౌదరి ఆర్థిక సాయం

విజయవాడ పశ్చిమ 

51 వ డివిజన్ 

కొండ ప్రాంత బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కార్యాలయం 

విజయవాడ పశ్చిమ, జులై 19.

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలోని 51 డివిజన్లోని కొండ ప్రాంతంలో

బాధిత కుటుంబానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షములకు

శుక్రవారం 51 డివిజన్ కొండ ప్రాంతంలో

పర్యటించిన సుజనా చౌదరి కార్యాలయం కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. కొండ ప్రాంతంలో నివసిస్తున్న కడవల నూకాలమ్మ, రాజు కుటుంబ సభ్యులకు సుజనా చౌదరి కార్యాలయం కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆర్థిక సాయం చేశారు నూకాలమ్మ ఇల్లు వర్షాలకు పిచ్చింగ్ జారిపోయినది.   

సమస్య తెలుసుకొని వెంటనే వారిని పరామర్శించి 

కొండ ప్రాంతంలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది. 

తమ సమస్య ఆలకించడంతోపాటు కొండ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని తమకు ఆర్థిక సాయం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *