డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలు

4
0

 డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి 

కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే

సుజనా చౌదరి ఆదేశాలు

 

విజయవాడ పశ్చిమ, జులై 19.

వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీల్లో నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని సుజనా చౌదరి పేర్కొన్నారు. 

పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉందో క్షుణ్ణంగా తెలుసుకోవాలని పారిశుద్ధ్య అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. 

39 డివిజన్ లో జోనల్ కమిషనర్ కీర్తనతో సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు విద్యాధరపురం ప్రాంతంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను జోనల్ కమిషనర్ కు వివరించారు. సమస్యలపై సత్వరమే చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here