ఎం.పి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను క‌లిసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్

Spread the love

 20-07-2024

ఎం.పి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను క‌లిసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్ 

విజ‌య‌వాడ :   టిడిపి రాష్ట్ర అధ్య‌క్షుడు గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. పల్లా శ్రీనివాస్ పుష్ప‌గుచ్ఛం అందించి ఎంపి కేశినేని శివనాథ్ ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.అనంత‌రం పల్లా శ్రీనివాస్ కు పుష్ప‌గుచ్చం అందించి శాలువాతో ఎంపి కేశినేని శివనాథ్ స‌త్క‌రించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు  టిడిపి పై వైసిపి అధ్యక్షుడు జ‌గ‌న్ చేస్తున్న దుష్ర‌చారం పై, రాష్ట్రాభివృద్దికి కేంద్రం నుంచి అందుకోవాల్సిన సాయం పై  చ‌ర్చించుకున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *