వర్షాల నేపథ్యంలో 52 డివిజన్లో బాధితులకు ఆర్థిక సాయం చేసిన.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 వర్షాల నేపథ్యంలో 

52 డివిజన్లో బాధితులకు ఆర్థిక సాయం చేసిన..

 విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ పశ్చిమ, జులై 21.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సహాయం చేశారు. 

నియోజకవర్గ పరిధిలో 52వ డివిజన్ లోని ఆకులు వారి వీధిలో నివసించే షేక్ రెహానా, షేక్ ఇమామి వర్షాల నేపథ్యంలో పాక్షికంగా గోడ కూలడం కొంత మేర నష్టం వాటిల్లడంతో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. 

 సమస్యపై సత్వరమే స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు 

షేక్ రెహనా కు 15000, 

షేక్ ఇమామి కుటుంబానికి 5000 రూపాయలు చొప్పున

ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 

 ఆర్థిక సహాయం చేశారు. 

వీటితోపాటు బాధిత కుటుంబాలు నివసించే ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు అధికారులకు ఎమ్మెల్యే తగు ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యను ఆలకించి తమకు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షులు

అడ్డూరి శ్రీరామ్, తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ ఉమ్మడి చంటి

 ఎన్ డి ఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *