కంచిబందార్లపల్లి గ్రామం దత్తత కార్యక్రమంలో భువనేశ్వరి స్పీచ్ పాయింట్లు

Spread the love

 కంచిబందార్లపల్లి గ్రామం దత్తత కార్యక్రమంలో భువనేశ్వరి స్పీచ్ పాయింట్లు

• కుప్పం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మా కుప్పం ఆడపడుచులకు నా హృదయపూర్వక నమస్కారాలు…

• ఆంధ్రప్రదేశ్ కు ఒకే వ్యక్తిని 4సార్లు ముఖ్యమంత్రిగా అందించిన మీ ఘనత చరిత్రలో నిలిచిపోతుంది.

• కుప్పం గడ్డ….ముఖ్యమంత్రి అడ్డా….అని మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో మరోసారి రుజువు చేశారు.

• కుప్పంతో సహా 175కి 175 సీట్లు గెలుస్తాం అని చెప్పిన వాళ్లకు కుప్పంలో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసిన మీ త్యాగం, మీ పట్టుదల, మీ అంకితభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా చూశాను.

• Why not 175 అన్న వాళ్లకు అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కుప్పం వేదికగా తెలియజేస్తున్నాను.

• గడిచిన 5 సంవత్సరాలు రాక్షస పాలనలో ఈ రాష్ట్రం భయం గుప్పిట్లో వణికిపోయింది. స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కూడా లేకుండా ఆటవిక పాలన చేశారు.

• కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలు రౌడీయిజం చెలాయించాలని చూశారు…మీరు ఎక్కడికక్కడ ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు.

• కుప్పం నియోజకవర్గం మా కుటుంబానికి ఎంతో అండగా నిలబడింది…మీకు చంద్రబాబుతో పాటు నేను కూడా అండగా నిలబడాలని అని నిర్ణయించుకున్నాను.

• అందుకే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి, నాకు వీలున్నప్పుడల్లా కుప్పం నియోజకవర్గానికి నేను ఏమి చేయగలుగుతానో అవి చేసి, మిమ్మల్ని మరింత ముందుకు నడిపించేందుకు నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను…

• నేను కష్టాలు, కన్నీళ్లు, బాధల్లో ఉన్నప్పుడు నిజం గెలవాలి కార్యక్రమంతో మీ దగ్గరకు వస్తే….నన్ను మీ తోబుట్టువులా మీరు ఆదరించారు. మా కుటుంబంపై మీరు చూపించే ప్రేమకు మేము మీకు ఏమి ఇచ్చినా రుణం తీరదు.

• లోకేష్ పాదయాత్రను కూడా ఈ పవిత్రమైన కుప్పం గడ్డ మీద నుండే ప్రారంభించారు…ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నింటినీ దాటుకుంటూ…పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేశాడు.

• ఎన్నికలకు ముందు నేను ఇచ్చిన మాట ప్రకారం కుప్పంలోని కంచిబందార్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను. రాష్ట్రంలో ఈ గ్రామాన్ని నంబర్ స్థానంలో పెట్టేందుకు కృషి చేస్తాను.

• చంద్రబాబు కుప్పం ప్రజల రుణం తీర్చుకోవాలని, జీవితాంతం చంద్రబాబు చేసిన మంచి పనులు గుర్తుండిపోవాలనే స్థాయిలో ఆయన మీకోసం, మీ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు.

• ఈ విషయాలు మీతో పంచుకోవాలి, మా కుటుంబం తరపున, చంద్రబాబుగారి తరపున, రాష్ట్ర ప్రజల తరపున మీకు ధన్యవాదాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను.

• మీకు ఏ సమస్య ఉన్నా మేమంతా మీకు అందుబాటులో ఉంటాం…మీ సమస్యలను మేం పరిష్కరిస్తాం…మీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం అని మాట ఇస్తున్నాను.

సల్లాపురెమ్మను దర్శించుకున్న భువనమ్మ

కంచిబందార్లపల్లి గ్రామంలోని సల్లపురెమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భువనేశ్వరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సల్లాపురెమ్మను దర్శించుకున్న భువనేశ్వరికి ఆలయ అర్చకులు హారతి, తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి శేష వస్త్రాన్ని భువనేశ్వరికి బహుకరించారు. అమ్మవారి దర్శనం అనంతరం కంచిబందార్లపల్లి గ్రామాన్ని భువనేశ్వరి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

కంచిబందార్లపల్లి 113బూత్ ఇన్చార్జి మురుగేష్ కు బంగారు ఉంగరం బహుకరణ

కంచిబందార్లపల్లి గ్రామంలోని 113వ బూత్ లో అత్యధిక మెజార్టీ వచ్చిన సందర్భంగా బూత్ ఇన్చార్జి మురుగేష్ కు కుప్పం టీడీపీ నేతలు బంగారు ఉంగరాన్ని బహుకరించారు. భువనమ్మ సమక్షంలో మురుగేష్ కు బంగారు ఉంగరాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్చార్జి పీఎస్ మునిరత్నం నాయుడు, తదితరులు అందించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *