రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీ పర్యటన పత్రికా ప్రకటన వివరాలు

5
0

 న్యూఢిల్లీ

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీ పర్యటన పత్రికా ప్రకటన వివరాలు

పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు అనుమతులు ఇప్పించండి

సిడబ్ల్యుసి చైర్మన్ ను కలిసి కోరిన మంత్రి రామానాయుడు

పోలవరం ప్రాజెక్టు సేఫ్టీకి  రాజీ పడకుండా డిజైన్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సిడబ్ల్యుసి చైర్మన్   కుష్వేందర్ ఓహ్ర ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు  కోరారు.  దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ  ఎన్డీఏ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత  పోలవరం ప్రాజెక్టుయేనన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి డిజైన్లు లో జాప్యం  లేకుండా  అనుమతిలిస్తామని  హామీ ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం సి డబ్ల్యూ సి చైర్మన్ ను ఆయన చాంబర్లో   మంత్రి రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను సత్కరించి  పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేసి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సి డబ్ల్యూ సి చైర్మన్  ఓహ్ర కు మంత్రి రామానాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమని  చెప్పారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయ్యే  ప్రతి సంవత్సరం వంట ఆయకట్టు  నష్టం 3 వేల కోట్లు, జల విద్యుత్తు  అందుబాటులోకి రాకపోవడం  వలన మరో మూడు వేల కోట్లు, వరద సమయంలో  గోదావరి జిల్లాల పంట నష్టం 2000 కోట్లు, ప్రతి సంవత్సరం అంచనా విలువ పెరగడం వలన 2000 కోట్లు ఈ రకంగా  ఒక సంవత్సరానికి సుమారు పదివేల కోట్లు ఐదేళ్ల ఆలస్యానికి 50 వేల కోట్లు నష్టపోతున్నామని  వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తితో   ఈ నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చునని  మంత్రి రామానాయుడు తెలిపారు.  అందువలన  ఎంత త్వరితగతిన   పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి దేశానికి  బహుళ ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. మంత్రి రామానాయుడు తో పాటు  జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సలహాదారులు  వెంకటేశ్వరరావు లు ఉన్నారు.

 కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు కృషి  కనిపించింది మంత్రి రామానాయుడు

 కేంద్ర బడ్జెట్లో  ఆంధ్రప్రదేశ్ కు  ఇచ్చిన ప్రాధాన్యతతో చంద్రబాబు కృషి కనిపించిందని  రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి  15 వేల కోట్ల  నిధులు కేటాయింపు తో పాటు పార్లమెంట్ సాక్షిగా  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు ఎన్డీఏ ప్రభుత్వం  సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారన్నారు.  అదేవిధంగా విభజన చట్టంలోని అంశానికి సంబంధించి  రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర  జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారన్నారు. విశాఖ చెన్నై కాడియార్ లకు హామీ ఇచ్చారు. ఈ ప్రాధాన్యతలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లోపు  రెండుసార్లు ఢిల్లీ వెళ్లి  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను  కలిసిన ఫలితమేనని మంత్రి రామానాయుడు చెప్పారు. గత ఐదు 10 ఏళ్లలో కనిపించని ప్రాధాన్యత  ఎన్డీఏ ప్రభుత్వంలో కనిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుజాతికి మంచి రోజులు వచ్చాయని మంత్రి రామానాయుడు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో  రాష్ట్రానికి జరిగిన నష్టం రాష్ట్ర విభజన కన్నా ఎక్కువ జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో జగన్  పలుమార్లు ఢిల్లీ వెళ్లిన, 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న కేంద్ర నిధులు తెచ్చుకోలేకపోవడం వైఫల్యం చెందడమేనన్నారు. ఆయన బెయిల్, కేసులు, ఆస్తులను కాపాడుకోవడం కోసమే వెళ్లి ఉంటారని   మంత్రి రామానాయుడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here