ముత్తుకూరు సర్పంచిపై కుల దూషణకు పాల్పడి… సంతకాలు ఫోర్జరీ చేసినవారిపై చర్యలు

Spread the love

 ముత్తుకూరు సర్పంచిపై కుల దూషణకు పాల్పడి… సంతకాలు ఫోర్జరీ చేసినవారిపై చర్యలు

*ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ 

సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారనీ… కచ్చితంగా పంచాయతీలను బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక వర్గం ముత్తుకూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి బూదూరు లక్ష్మి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి, కుల దూషణలు చేయడం, తన సంతకం ఫోర్జరీ చేయడంపై ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలోని ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  తో కలసి ముత్తుకూరు సర్పంచ్ తనకు ఎదురైనా ఇబ్బందులు, అవమానాలను వివరించారు.

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని, ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  స్పందిస్తూ  “ముత్తుకూరు సర్పంచ్ శ్రీమతి బూదూరు లక్ష్మిపై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి సంతకాలు చేయించిన విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించాను. సంతకాలు ఫోర్జరీపై విచారణ చేపడతాము. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ సర్పంచ్ పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  కూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు” అన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *