ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

Spread the love

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  తో ఆస్ట్రేలియా హై కమిషనర్ శ్రీ ఫిలిప్ గ్రీన్  బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి  నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ఫిలిప్ గ్రీన్ . ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో  పవన్ కళ్యాణ్  ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్   జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ శ్రీ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *