శాసనసభ్యులు,టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు సంబంధిత అధికారులతో కలిసి విచ్చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగినది

Spread the love

61వ డివిజన్ శాంతినగర్

శాసనసభ్యులు,టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు సంబంధిత అధికారులతో కలిసి విచ్చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగినది 

ది.23-07-2024 ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం 5:30″గం లకు” సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ శాంతినగర్ మసీద్ ఏరియా పార్క్ నందు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు,టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు సంబంధిత అధికారులతో కలిసి విచ్చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగినది

ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ:- రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైందని, సెంట్రల్ నియోజకవర్గంలో ఏ డివిజన్ లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నప్పుడు గత వైసిపి ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన సమస్యలు గుట్టలు గుట్టలుగా కనపడుతున్నాయని, సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని స్కూల్స్ ,పార్కుల లో ఆకతాయిలు గంజాయిలు తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ మద్యపానం సేవిస్తూ చుట్టుపక్కల పరిసరాలను కూడా పాడు చేస్తున్నారని

ఆ పరిసర ప్రాంతాలలో నివసించేటువంటి ఆడవారు భయపడి పోతున్నారు అని, గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులే గంజాయికి కొమ్ము కాయడం వల్ల రాష్ట్రంలో విపరీతంగా గంజాయి పెరిగిపోయిందని…

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని నిర్మూలించడానికి ఉక్కు పాదం మోపడం జరిగినదని, రాష్ట్రంలోనే గంజాయి ఎక్కడ లేకుండా చేయాలని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ , హోమ్ మినిస్టర్ వనిత ఎక్కడ గంజాయి కనిపించినా కూడా పోలీసులను ఉపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగినదని

ఆకతాయిలు గంజాయి తాగి చుట్టుపక్కల ప్రజలను ఇబ్బందులకు గురి చేసినట్టు తెలిసిన ఆడవారకు ఇబ్బందులు కలిగినట్లు తెలిసిన సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది…

తెలుగుదేశం ప్రభుత్వంలో శాంతిభద్రతలకు ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రాణాలకు ఆస్తులు ఎటువంటి భంగం కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి అధికారి మీద ఉన్నదని…

అలాగే మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోనటువంటి పార్కులను తక్షణమే అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పిల్లలకు మహిళలకు వాకర్స్ కు ఉపయోగపడేలాగా జుమ్మెక్యుమెంట్స్ మరియు పిల్లలు ఆడుకునే వసతులను ఏర్పాటు చేయాలని,

అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షంతో త్రాగునీటి సమస్యను తక్షణమే నివారించి ప్రజలకు త్రాగునీరు అందేలా చూడాలి అని సంబంధిత అధికారులను బోండా ఉమా ఆదేశించారు…

ఈ కార్యక్రమంలో;-61వ డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర దుర్గారావు (పెప్సీ), Ch శ్రీనివాస్ రావు, అమ్మా రావు, దాసరి ఉదయ్ శ్రీ, దాసరి కనకారావు, ఆకుల సూరి ,చింతల దుర్గా ప్రసాదు, D ఫణి కుమార్, వలివేటి శ్రీను, అన్నా బత్తుల శ్రీను, షరీఫ్, శివకుమారి,రమణయ్య, సాంబ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు…

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *