ప్రజల సంతృప్తే ప్రధానం ప్రజల యోగక్షేమాలే లక్ష్యం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్

Spread the love

 ప్రజల సంతృప్తే ప్రధానం

 ప్రజల యోగక్షేమాలే లక్ష్యం

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖాధిపతులందరూ కమిషనర్  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సంతృప్తే ప్రధానంగా, ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తుందని అన్నారు. నగర పరిధిలో ఉన్న 64 వార్డుల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ నిర్వహణలో జాతీయ ప్రమాణాలతో మెరుగుపడేటట్లు చూసుకుంటామని, ప్రజలకు కేవలం సురక్షితమైన త్రాగునీటినే సరఫరా చేసేటట్టు చూసుకుంటామని, సైడ్ డ్రైన్ లలో త్రాగునీటి పైప్ లైన్ లో లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటూ స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేసేటట్టు చూసుకుంటామని, వాడకంలో ఉన్న నీరును కూడా సివేజ్ ట్రీట్మెంట్ ద్వారా మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోబోతున్నామని, నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచుతామని తద్వారా కాలుష్యాన్ని నివారించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని కల్పించవచ్చని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తున్న ప్రాజెక్టులను కూడా సంపూర్ణంగా అమలు చేసే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తుందని తెలిపారు. 

 తదుపరి బాధ్యతలు స్వీకరించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర ఐఏఎస్ కి, కార్పొరేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తమకి శుభాకాంక్షలు అందచేయడానికి వచ్చిన ప్రతి ఒకరితో వారి పరిచయాలు తెలుసుకొని, వారికి ధన్యవాదాలు చెప్పారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *