ఘనంగా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు జన్మదినోత్సవం

Spread the love

 ఘనంగా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు జన్మదినోత్సవం

.

అభిమానుల కోలాహలం మధ్య కేకును కట్ చేసిన నాగేశ్వరరావు 

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు శిరీష

ఎన్టీఆర్ జిల్లా, ఐతవరం, 29.07.2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోం మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను సోమవారం ఆయన స్వగ్రామమైన ఐతవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అభిమానుల కోలహాలం మధ్య భారీ కేకును వసంత నాగేశ్వరరావు కట్ చేశారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆయన సతీమణి శిరీష కూడా జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వసంత నాగేశ్వరరావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి మాజీ హోం మంత్రిగా, ఆప్కాబ్ చైర్మన్గా గతంలో ప్రజలకు అందించిన విశిష్ట సేవలను, చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో వసంత అభిమానులు జన్మదిన శుభాకాంక్షలతో హోరెత్తించారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *