పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం

Spread the love

 పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది. అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. 

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *