షేక్ రాజా సాహెబ్ ప్రభుత్వాసుపత్రిని ఆధునికరిస్తాం
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు
కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మోడ్రన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
గత నెలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి రాజా సాహెబ్ ఆసుపత్రిని సందర్శించి అభివృద్ధి గురించి ఆరా తీశారని అందుకు అవసరమైన నిధులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిని ఆధునికరించడానికి ఎంత బడ్జెట్ అవసరమో తగిన నివేదిక అందించాలని తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు.రోగులకు అందించాల్సిన సేవలు మరియు మౌలిక వసతుల గురించి అంచనా వేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సుజనా పశ్చిమ లోని ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు.