పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

Spread the love

 పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు 

ఎమ్మెల్యే కేపీ ని కలసిన కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 8.8.2024

కొండపల్లి మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణప్రసాదు  ఆదేశాలు జారీ చేశారు

మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణప్రసాదు ని, కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా నేడు బాధ్యతలు చేపట్టిన బి.రమ్యకీర్తన  విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు

ఆమె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ గా కూడా విధులు నిర్వర్తిస్తూ, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు.

ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, కొండపల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *