08-08-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
ఈరోజు ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయ ఇంజినీరింగ్ అధికారులు లింగం రమ మరియు సిబ్బందితో కలిసి
కొండ క్రింద జరుగుచున్న ఆలయ అభివృద్ధి పనులలో భాగముగా అన్నదానము మరియు ప్రసాదం పోటు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సదరు పనులకు గాను time lines ను ఆలయ ఇంజినీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ లకు సూచించారు.
మరియు ఆలయం నందు క్యూ లైన్ లు మరియు ఇతర ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు సూచనలిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తో పాటుగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమ ఏఈఈ లు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.