RRR విజ్ఞాన కేంద్రం, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన

Spread the love

 విజయవాడ నగరపాలక సంస్థ 

08-08-2024

 RRR విజ్ఞాన కేంద్రం, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్  ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన

 *విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా  అజిత్ సింగ్ నగర్ లోని  RRR విజ్ఞాన కేంద్రం, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ( ఎక్సెల్ ప్లాంట్ ) పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

 ముందుగా RRR విజ్ఞాన కేంద్రం సందర్శించి, అందులో ఉన్న వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎక్స్పీరియన్స్ సెంటర్  పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తదుపరి గార్బేజ్  ట్రాన్స్ఫర్ స్టేషన్ లో జరిగే వ్యర్ధపదార్థాల నిర్వహణ, వ్యర్థ పదార్థాల నుండి  ఉపయోగపడే వస్తువుల తయారీ పరిశీలించారు.

 గార్బేజ్  ట్రాన్స్ఫర్ స్టేషన్లో ఉన్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్, కంపోస్ట్ ప్లాంట్, కొబ్బరి బొండాల వ్యర్ధాల నుండి  తయారు చేస్తున్నా ఎరువు, పరుపుల తయారీకి వినియోగించే  కొబ్బరి పీచులు, కన్స్ట్రక్షన్ అండ్ డెమోషన్  (c&d) వ్యర్ధాల నుండి చేసే ప్లేయర్ బ్లాక్స్, పూల వ్యర్ధాలతో చేసే అగరవత్తులు, ధూపాలు, తదితర వ్యర్థ  నిర్వాహణ పనులను అధికారులతో పరిశీలించారు.  

 ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర  మాట్లాడుతూ ఇది కేవలం ప్రజల సహకారంతోనే జరుగుతుందని ప్రజలందరూ వ్యర్ధాలను ఇంటి వద్దనే విభజించి కార్పొరేషన్ వారికి ఇవ్వాలని తద్వారా వ్యర్ధాల నుండి సంపద సృష్టించవచ్చని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. 

 ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కే.వి సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వెంకటేశ్వర రెడ్డి, ఏ ఎస్ ఎన్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *