గిరిజన మహిళ గుడిసెను తగులబెట్టించిన వైసీపీ నాయకుడు

Spread the love

 గిరిజన మహిళ గుడిసెను తగులబెట్టించిన వైసీపీ నాయకుడు

నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టి యానాది కాలనీకి చెందిన గిరిజన మహిళ *మేకల కోటమ్మ* టిడిపికి ఓటు వేసిందని కక్ష కట్టిన *వైసిపి నాయకుడు నక్క నాగిరెడ్డి* ఆమెను హతమార్చేందుకు పథకం వేసి ఆ కాలనీలోని వైసిపి వర్గీయులైన ఇల్లా హనుమంతరావు, రామకోటయ్య, వీరాంజి, రాజయ్య మరికొందరైన తన మనుషులతో గుడిసెలో నిద్రిస్తున్న మేకల కోటమ్మను చంపేందుకు గుడిసె తగుల పెట్టించి దారుణానికి ఒడిగెట్టాడు. మంటలు వ్యాపించడంతో మేకల కోటమ్మ, కుటుంబ సభ్యులు తప్పించుకొని ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తాము టిడిపికి ఓటు వేశామని కక్ష కట్టి నాగిరెడ్డి తనను చంపేందుకు గుడిసె తగలబెట్టించడమే కాక సోమవారం ఉదయం తన వద్దకు నాగిరెడ్డి వచ్చి షార్ట్ సర్క్యూట్తో నీ గుడిసె తగలబడిందని బుకాయిస్తూ బెదిరించాడని బాధితురాలు కోటమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనను హత్య చేసేందుకు ప్రయత్నించి, గుడిసెను తగలబెట్టించిన వైసిపి నాయకుడు నక్క నాగిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *