హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జెండాలు పంపిణీ

Spread the love

 హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జెండాలు పంపిణీ

.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ఆఫీసెస్ రవి కిషోర్ విజయవాడ నార్త్  వారి ఆధ్వర్యంలో పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది బుధవారం  పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి నీ కలసి జాతీయ జెండాలు అందజేశారు. ఆజాదికా అమృత్ మహోత్సవం లో భాగంగా కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విజ్ఞప్తిని శి రసావహిస్తూ విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేస్తున్నామని సుజనా కు తెలిపారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలనె పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగస్వాములైన పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బందిని ఎమ్మెల్యే సుజనా అభినందించారు సబ్ పోస్టుమాస్టర్ పీ లక్ష్మణరావు పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *