రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా : ఎం.పి.కేశినేని శివనాథ్

Spread the love

 21.08.2024

రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా : ఎం.పి.కేశినేని శివనాథ్

విజయవాడ: రాజీవ్ గాంధీ హోల్ సెల్ మార్కెట్ విజిటేబుల్, ఫ్లవర్స్ మార్కెట్ ను విజయవాడ ఎం.పి కేశినేని శివ నాథ్ బుధవారం సందర్శించారు. రైల్వే శాఖ అధికారులు వేసిన‌ గిడర్లు గత కొన్ని నెలలుగా సరుకు లోడ్ ఉన్న లారీ లు లోప‌ల‌కి రాలేక‌పోతున్నాయని… అందువల్ల ఎదుర్కొంటున్న సమస్యలను మార్కెట్ నాయకులు, వర్తకులు, ముఠాకూలీలు ఎం.పి కేశినేని శివ నాథ్ కు వివరించారు. రైల్వే అధికారులు, వి.యం.సి అధికారుల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, గిడర్లు తీసివేయించాలని కోరారు. గిడర్లు ఉండటం వ‌ల్ల ముఠా కూలీలు, వ‌ర్త‌కులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను రైల్వే అధికారుల‌తోపాటు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజీవ్ గాంధీ హోల్ సెల్ మార్కెట్ విజిటేబుల్ అసోసియేష‌న్ ధ‌ర్మ‌రాజు , సెక్ర‌ట‌రీ సానికొమ్ము అజ‌య్ కుమార్, స‌య్య‌ద్ ర‌ఫీ, టిడిపి స్టేట్ ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ ఎమ్.ఎస్.బేగ్ పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *