22-08-2024
బెజవాడలో ప్రతిపక్ష పార్టీ ఉండకుండా చేస్తాం..టిడిపి కంచుకోటగా మారుస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడలో వైసిపికి ఊహించని షాక్.
టిడిపి కండువాలు కప్పుకున్నముగ్గురు వైసిపి వెస్ట్ కార్పొరేటర్లు
నగరాభివృద్ధి కాంక్షించే నాయకులకు మాత్రమే స్వాగతం
నాయకులందరం ఒక ప్రణాళికతో ముందు సాగుతాం
త్వరలో సెంట్రల్ నుంచి భారీ చేరికలు
హింట్ ఇచ్చిన ఎమ్మెల్యే బొండా ఉమా
విజయవాడ : జగన్ పాలన ఆలోచన తీరుతో రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు…వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా విసిగిపోయారు. అందుకే విజయవాడ నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా, బేషరతుగా వైసిపి వీడి టిడిపిలో వస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు వైసిపి కార్పొరేటర్లు ఎంపి కేశినేని శివనాథ్ సమక్షంలో టిడిపి కండువాలు కప్పుకున్నారు. ఈ చేరికల కార్యక్రమంలో గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్ లో గురువారం జరిగింది. 45వ, 44వ, 54వ డివిజన్స్ కి చెందిన వైసిపి కార్పొరేటర్స్ ఎస్.కె.హర్షద్, మైలవరపు రత్నకుమారి, మధూరి లావణ్య వైసిపి వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎంపి కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.
ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పార్టీలో సీనియర్ సలహాలు తీసుకుంటూ విజయవాడను టిడిపికి కంచుకోటగా మారుస్తానన్నారు. నగరంలో విపక్షపార్టీలు లేకుండా చేసేందుకు ఒక ప్రణాళికతో నాయకులందరం కలిసికట్టుగా ముందుకు వెళతామన్నారు.
టిడిపిలోకి రావటానికి వైసిపి కార్యకర్తలు మాత్రమే కాదు నాయకులు కూడా సిద్దంగా వున్నారని తెలిపారు. అయితే నగరాభివృద్ది కోరుకునే వారిని, స్వచ్ఛందంగా వచ్చే వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.అలాగే ప్రజల్లో మంచి పేరు వున్న నాయకులను మాత్రమే టిడిపిలోకి ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. నగరాభివృద్ది కాంక్షిస్తూ ఆ పార్టీని వీడి టిడిపిలోకి చేరిన ముగ్గురు కార్పొరేటర్స్ ను అభినందించారు.
టిడిపి హయంలో 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగరం అభివృద్ది పథంలో ఎలా దూసుకుపోయిందో అదే విధంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి,,నాగుల్ మీరా తో కలిసి విజయవాడ అభివృద్ది చేసి చూపిస్తామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూపశ్చిమ నియోజవర్గం నుంచే కాదు..త్వరలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా టిడిపిలోకి చేరికలు వుంటాయన్నారు. ప్రజాభివృద్ది, నగరాభివృద్ది కాంక్షించే నాయకులందరూ టిడిపిలోకి రావటానికి సిద్ధంగా వున్నారని తెలిపారు. ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడి చేరికలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రాజకీయాలు ఎన్నికల వరకే చేస్తామని ఆ తర్వాత ఎవరైనా అభివృద్ది గురించే ఆలోచిస్తారని చెప్పారు. రెండు పార్టీ మధ్య సిద్దాంతపరమైన విబేధాలు తప్పితే వ్యక్తిగత ద్వేషాలు విబేధాలు వుండవన్నారు. వైసిపి నుంచి వచ్చేందరికీ స్వాగతం పలికితే విజయవాడ నగర పాలక సంస్థలో వైసిపి ఎప్పుడో ఖాళీ అయ్యేదన్నారు. కానీ తాము అలా చేయటం లేదని పార్టీలో చేరతామని వచ్చిన వారిని పరిశీలించి, కార్యకర్తలు,నాయకులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
జగన్ సర్కార్ పాలనలో గత ఐదేళ్లుగా విజయవాడ అభివృద్ది కళ తప్పిందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వైసిపి కార్పొరేటర్లకు నిధులు ఇవ్వకుండా గ్రూప్ తగదాల వల్ల అన్ని రకాలుగా వారు నష్టపోయారన్నారు. అభివృద్ది చిరునామా అయిన టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరూ ప్రజాభివృద్ది, నగరాభివృద్ది కాంక్షిస్తూ టిడిపిలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ఎంపి కేశినేని శివనాథ్ నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేలు, పార్టీనాయకులు ఒక మాట మీద నిలబడి ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులందరం ముగ్గురు కార్పొరేటర్స్ తెలుగుదేశం పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. నియంతృత్వ దోరణి గల నాయకత్వంలో పనిచేయలేమని భావించి, ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటానికి సిద్దంగా వున్నారని తెలిపారు. టిడిపిలోకి వారి ఇష్టాపూర్వకంగా వచ్చే తప్పా…తాము ఎవర్ని పార్టీలోకి రావాల్సిందిగా కోరలేదన్నారు..
ఇక మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ జగన్ తన సైకో ఆలోచనలతో కూర్చున్న కొమ్మను తానే నరుకున్నాడు..అందుకే వైసిపి పార్టీని ప్రజలు ఎవరు నమ్మలేదు. ఇప్పుడు ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు జగన్ నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. త్వరలోనే విజయవాడ నగర పాలక సంస్థను కూడా కైవసం చేసుకోబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మాద్ ఫతావుల్లాహ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్.బేగ్, తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు,మాదిగాని గురునాథం తదితరలు పాల్గొన్నారు.