నరసరావుపేట డీఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కే నాగేశ్వరరావు..

Spread the love

 నరసరావుపేట డీఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కే నాగేశ్వరరావు..

ఆగస్టు 22:- పలనాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట డీఎస్పీగా కే. నాగేశ్వరరావు గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. డిజిపి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరావును నరసరావుపేట డీఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఫ్యాక్షనిస్టులను, రౌడీయిజాన్ని అణచి వేసి శాంతి భద్రతలను కాపాడటంలో సమర్థవంతమైన అధికారిగా పేరున్న నాగేశ్వరరావు 2017లో నరసరావుపేట డీఎస్పీగా విధులు నిర్వహించారు. తన సర్వీసులో ఎక్కువ కాలం ఎస్సైగా, సిఐ గా పల్నాడు ప్రాంతంతోపాటు గుంటూరు జిల్లాలో పనిచేశారు. సుమారు 32 మంది ఫ్యాక్షనిస్టులు, రౌడీలకు జీవిత ఖైదు పడేటట్లు చర్యలు తీసుకున్నారు. మొదట 1989లో ఎస్ఐగా ముప్పాలలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సీఐగా, డీఎస్పీగా పదోన్నత పొంది నరసరావుపేట, తిరుపతి, మరియు సిఐడిలో విధులు నిర్వహించారు. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జర్నలిస్టుల క్రీడా పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. గుంటూరు డిఐజిగా ఏకే ఖాన్, డీఎస్పీగా ప్రభాకర్ రావు ఉన్న సమయంలో అరండల్ పేట లో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు జర్నలిస్టుల క్రీడా పోటీలకు సహకారం అందించడమే కాక పోలీస్ శాఖకు జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేసినట్లు అప్పటి గుంటూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *