సుజనా ఫౌండేషన్ సేవలు అభినందనీయం పురందరేశ్వరి

4
0

 సుజనా ఫౌండేషన్ సేవలు అభినందనీయం

పురందరేశ్వరి 

పేద ప్రజల కోసం సుజనా ఫౌండేషన్ చేస్తున్న సామాజిక, సేవా, కార్యక్రమాలను ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి కొనియాడారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో గత 15 రోజులుగా భవానిపురం ఎన్డీయే కార్యాలయ ఆవరణలో విజయవంతంగా కొనసాగుతున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం పురందేశ్వరి సందర్శించారు. వైద్య శిబిరంలో మహిళలకు జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మానవసేవే మాధవసేవగా భావించి అనేక దశాబ్దాలుగా సుజనా ఫౌండేషన్ వారు అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.సెప్టెంబర్ 15 వరకు భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచనేని కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బొమ్మ కంటి వెంకటరమణ, చింతా బాబి , సృజన్ ,మంతెన తరుణ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here